![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఆదివారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి వినోదంతో పాటుగా ఫ్యామిలీ సెంటి మెంట్ ని చూపించేసాడు బిగ్ బాస్.
హౌస్ లోకి 2.0 లో గ్రాంఢ్ గా వచ్చిన 5 మంది కంటెస్టెంట్స్ లలో.. గతవారం నయని పావని, ఈ వారం పూజామూర్తి కలిపి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ లలో రెండు టీమ్ లని చేసి, వారిచేత బతుకమ్మ చేయడానికి రకరకాల పూలని ఇచ్చి బతుకమ్మ చేయమన్నాడు నాగార్జున. ఇందులో పల్లవి ప్రశాంత్ టీమ్ బతుకమ్మని బాగా చేసి టాస్క్ లో గెలిచారు. ఆ తర్వాత రెబా మౌనిక, డింపుల్ హయాతి, పాయల్ రాజ్ పూత్ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. ఇక కొంతమంది సింగర్స్ చేత పాటలు పాడించారు. ఇక ఈ సండే ఫండే తో పాటు ఎమోషనల్ చేసాడు నాగార్జున. టాస్క్ లలో గెలిచిన టీమ్ లలోని ఇద్దరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రాసిన లెటర్ లని ఇప్పించాడు నాగార్జున. అందులో శోభాశెట్టి, అమర్ దీప్ లు మొదట టాస్క్ లలో గెలిచి లెటర్స్ తీసుకున్నారు.
యావర్ కి వాళ్ళ ఫ్యామిలీ నుండి వచ్చిన లెటర్ చదువుతూ ఎమోషనల్ అయ్యాడు. దాంతో ప్రియాంక జైన్ ని ఆ లెటర్ చదవమనగా.. తను చదువుతూ మరింత ఎమోషనల్ అయింది. ఆ లెటర్ తర్వాత చదువుకోమని యావర్ తో నాగార్జున చెప్పాడు. ఇక ఆ తర్వాత పోస్టర్ చూసి పాటని గెస్ చేయమని టాస్క్ ఇచ్చాడు. దానిని బాగా అందరు బాగా ఆడారు. రెండు టీమ్ లకి టై అయింది. దాంతో వాళ్ళకి వచ్చే లగ్జరీ బడ్జెట్ హౌస్ మేట్స్ అందరికి అందింది. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.
![]() |
![]() |